ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. మే 13న ఎన్నికలు కావడంతో ఇప్పటి నుంచే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టాయి. ఇదిలా ఉండగా తాాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఇప్పటి వరకు తమతో ఫ్రెండ్లీగా వ్యహరించిన వైసీపీని కాదని.. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో బీజేపీతో పొత్తుపై వైసీపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీతో జగన్ ప్రభుత్వ సంబంధమేనని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రం అన్నట్లుగానే బీజేపీతో అనుబంధం ఉందని తెలిపారు. ఏపీలో పొత్తుపై బీజేపీ నుండి మాకెప్పుడో ఆఫర్ ఉందని సజ్జల కీలక విషయం బయటపెట్టాడు. ఎన్డీఏ కూటమితో కలిసి కలిసి వెళ్లాలనుకుంటే ఎప్పుడో వెళ్లేవాళ్లమన్నారు. ముందు నుండే బీజేపీతో పొత్తు వద్దునుకున్నామని.. అందుకే ఎన్డీఏ కూటమిలో చేరలేదని క్లారిటీ ఇచ్చారు. పొత్తు పెట్టుకుంటే తర్వాత విభేదాలు వస్తాయని.. పొత్తు చెడిన తర్వాత చంద్రబాబులా తాము ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేమని ఎద్దేవా చేశారు.