మొహల్లా క్లినిక్ లలో మందుల కొరత లేకుండా చూడండి.. కేజ్రీవాల్ రెండో ఉత్తర్వు జారీ..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా రెండో ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేశారు. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ లలో మందుల కొరత లేకుండా చూడాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించినట్టు మంత్రి సౌరబ్ భరద్వాజ్ తెలిపారు. ప్రజలకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించాలని సూచించినట్టు వెల్లడించారు. ‘ఢిల్లీ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై కేజ్రీవాల్ ఆవేదన చెందారు. క్లినిక్ లలో చేస్తున్న పరీక్షల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎంకు సమాచారం అందింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ జారీ చేశారు’ అని మీడియా సమావేశంలో భరద్వాజ్ వెల్లడించారు.

దీంతో ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ భరోసా ఇచ్చారని తెలిపారు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచి మొదటి ఉత్తర్వును మార్చి 24న జలవనరుల శాఖకు పంపించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని మంత్రి అతిశిని ఒక నోట్ ద్వారా ఆదేశించారు. దీనిని ఈసీ సీరియస్ గా తీసుకుంది. కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కి కాగితం ఎలా వచ్చింది అనేదానిపై ఈడీ విచారణకు దిగింది. కోర్టు ఆదేశాల మేరకు కస్టడీ నుంచి ఆదేశాలు జారీ చేసే హక్కు ఏ ముఖ్యమంత్రికైనా ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ రెండో ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news