బీజేపీ హై కమాండ్ నిర్ణయం తోనే సోము వీర్రాజు భవిష్యత్ : పురంధేశ్వరి

-

బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ సోము వీర్రాజుకు ఈ సారి ఎన్నికల్లో నిరాశ కలిగింది. రాజమండ్రి రూరల్ లేదా సిటీ నుంచి పోటీ చేయాలని భావించిన ఆయనకు బీజేపీ హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. సోముకు సీటు నిరాకరించింది. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు డుమ్మ కొట్టారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు సీటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. సోము వీర్రాజు భవిష్యత్తును బీజేపీ హైకమాండ్ తీసుకుంటుందని తెలిపారు. అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థులను ప్రకటించారని చెప్పారు.

వలస వచ్చిన వారికి సీట్లు కేటాయించామని చెప్పడం సరికాదన్నారు. పాత, కొత్త అందరూ బీజేపీ వారేనని చెప్పారు. అధిష్టానం నిర్ణయం మేరకే టికెట్ల కేటాయించామని వెల్లడించారు. అధిష్టానం నిర్ణయానికి బీజేపీ కార్యకర్తలు కట్టుబడి ఉండాలని పురంధేశ్వరి పేర్కొన్నారు. సీట్లు దక్కని వారు నిరాశ పడటంలో తప్పులేదన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడానికే సమావేశం నిర్వహించామని చెప్పారు. పోటీ చేయాలనే ఆశ ప్రతీ నేతలో ఉంటుందని.. కానీ బీజేపీ హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతించాలని పురంధేశ్వరి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news