రేపో.. మాపో అవినాష్ రెడ్డి జైలుకు.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు..!

-

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో రేపో మాపో ఎంపీ అవినాశ్ రెడ్డి జైలుకు వెళతారని వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ షర్మిలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనాల్లో ఉండే నాయకులు రావాలని, జైలుకు పోయే అవినాశ్ రెడ్డి లాంటి వ్యక్తులు కాదని పిలుపునిచ్చారు సునీత.

ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిలను గెలిపించాలని.. అప్పుడే వివేకా ఆత్మకు శాంతి కలుగుతుందని తెలిపారు. వివేకా హత్య విషయంలో తాము న్యాయం కోసం పోరాడుతున్నామని.. కానీ ప్రజా తీర్పు చాలా పెద్దదన్నారు. ప్రజా తీర్పు కోసమే వైఎస్ షర్మిల ఎంపీ బరిలోకి దిగారని పేర్కొన్నారు వైఎస్ సునీత. పేదల ప్రజల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని.. మళ్లీ ఆయన బిడ్డ షర్మిలకు ఓటేస్తే అలాంటి పాలనను చూస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news