స్థానిక సంస్థల ఎన్నికల రద్దు ఆదేశాలపై అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. రెగ్యులర్ కోర్టులో విచారణ చేద్దామన్న హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ ని వాయిదా వేసింది. అయితే ఎస్ ఈ సీ తరపు న్యాయవాదులు అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని వాదించారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న SEC, ఈ నెల 23న మొదటి దశ ఎన్నికలు చేయాలని నిర్ణయించగా స్టే వల్ల ప్రోసెస్ అంతా జాప్యం అవుతుందని వాదించింది. ఎన్నికల కమిషన్ కి ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఉంటుందా లేదా అని 4 వేల మెయిల్స్ వచ్చాయని SEC పేర్కొంది. ఎలాక్ట్రోరల్ లిస్ట్ ప్రిపరేషన్ కూడా ఆగిపోతుందన్న SEC తరపు న్యాయవాదులు అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని వాదించారు. వాదనలు విన్న తర్వాత సెలవల తర్వాత ఈ నెల 18న రెగ్యులర్ కోర్టులో వింటామని వాయిదా వేసింది హైకోర్టు. ఎలాక్ట్రోరల్ రోల్స్ అందజేసే ప్రక్రియ కొనసాగుతుందన్న ప్రభుత్వం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపధ్యంలో ప్రభుత్వ పథకాల అమలుపై సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 18న పిటిషన్ ను చీఫ్ జస్టిస్ విచారించనున్నారు.