నామినేషన్‌ పద్ధతి: బాబు గతం మరోసారి!

-

ఏపీలో ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలు వ్యవహారం ఒక్క రోజులో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు! ఈ కిట్స్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు, ఒక వర్గం మీడియా ఒక రేంజ్ లో జగన్ ప్రభుత్వాన్ని వాయించేశారు! ఇదంతా ఒక్క పూటకే పరిమితం అయ్యింది… ఇంతలోనే జగన్ జనాలకు, జర్నలిస్టులకు, ప్రతిపక్షాలకూ క్లారిటీ ఇచ్చేసరికి.. అంతా సద్దుమణిగింది! ఈ క్రమంలో ఇలాంటి ఆలోచనలు చేసేది చంద్రబాబే… గతంలో కూడా ఈయన చేసినవి అన్నీ ఇన్నీ కాదు అంటూ “బాబు గతాన్ని” గుర్తు చేసేపనికి పూనుకుంది సాక్షి పత్రిక!

వరదలు, కరవు వంటి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యల్లో భాగంగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులు, అదికూడా రూ.ఐదు లక్షల్లోపు విలువైనవి మాత్రమే “నామినేషన్‌ పద్ధతి”లో అప్పగించాలన్నది నిబంధన.. అని మొదలుపెట్టిన సాక్షి… ఇలాంటి పరిస్థితులు గతంలో వచ్చినప్పుడు ఏమి చేసింది అని మొత్తం తవ్వి తీసింది! సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయని అని చెప్పుకుంటున్న దశలో మరోసారి బాబు గత బాగోతాలను ప్రజలముందుకు తీసుకొచ్చింది!
కృష్ణా పుష్కరాలు ఎప్పుడో 2016 ఆగస్టు 12 నుంచి ప్రారంభమవుతాయని 2014 ఆగస్టులోనే ముహూర్తం నిర్ణయించేసి.. ఘాట్ల నిర్మాణం పనులకు అంటూ రెండేళ్ల క్రితమే రూ.234 కోట్లు తమకు కావాల్సిన కాంట్రాక్టు సంస్థలైన ఎల్‌ అండ్‌ టీ, సూర్య కన్‌స్ట్రక్షన్స్‌ కు “నామినేషన్‌ పద్ధతి”లో అప్పగించి ఏ రేంజ్ లో కమీషన్లు తీసుకున్నారు అన్నది తెలిసిన విషయమే అని చెప్పుకొచ్చింది.

ఇదే క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసి.. హెడ్‌ వర్క్స్‌లో రూ.3,489.94 కోట్లు, కుడి కాలువలో రూ.1,645 కోట్లు, ఎడమ కాలువలో రూ.2,850 కోట్లు చొప్పున.. మొత్తం రూ.7,984.93 కోట్ల విలువైన పనులను అప్పటి ప్రభుత్వంద “నామినేషన్‌ పద్దతి”లో అప్పగించి కమీషన్లు వసూలు చేసుకుందని వివరించింది.
‘జన్మభూమి కమిటీ’ల ముసుగులో టీడీపీ నేతలకు “నామినేషన్‌ పద్ధతి”లో అప్పగించే వెసులు బాటు కల్పిస్తూ టీడీపీ సర్కార్‌ ఉత్తర్వ్యులు జారీ చేసుకుని.. తదవారా టీడీఎపీ ఎంపీలు, ఎమ్మెల్యేల్లు, ఎమ్మెల్సీల సన్నిహితులతో రూ.18,060.70 కోట్లను నీరు–చెట్టు కింద ఖర్చు చేసి.. ఒక్క చెట్టూ కనిపించకుండా చేశారు అని సాక్షి వివరించింది!

ఈ రేంజ్ లో జనం ఇప్పుడిప్పుడే కాస్త మరిచిపోతున్న చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలు, నామినేషన్ పద్ధతిలో జరిగిన అవకతవకలపై ఏపీ వాసులకు మళ్లీ కళ్లకు కట్టినట్లు చూపించింది సాక్షి!! విషయం తెలుసుకోకుండా.. అదిగో పులి అంటే ఇదిగో మేక అని చేసిన విమర్శల ఫలితం ఇది అంటూ టీడీపీ నేతలు తెగ ఫీలయిపోతున్నారట!!

Read more RELATED
Recommended to you

Latest news