తొడలు లావుగా ఉన్నాయా..? ఈ దుస్తులు వేసుకుంటే అందరి కంటే అందంగా వుంటారు..!

మనం వేసుకునే బట్టల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఎందుకంటే మంచి బట్టలు మనకి
సూట్ అయ్యే బట్టలు వేసుకుంటే మనం అందంగా కనపడడానికి అవుతుంది. నిజానికి ప్రతి ఒక్కరు కూడా అందంగా కనపడాలని అందరి కంటే అందంగా ఉండాలని అనుకుంటుంటారు అయితే కాస్త ఒళ్ళుగా ఉన్నవాళ్లు ఏది కూడా సెట్ అవ్వడం లేదని బాధపడుతూ ఉంటారు. సన్నగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు.

ఏ డ్రెస్ అయినా కూడా ఇట్టే సూట్ అయిపోతుంది. అయితే బాగా తొడలు ఎక్కువగా ఉన్నవాళ్లు ఇటువంటి బట్టల్ని వేసుకుంటే అందంగా కనబడతారు. అసలు అగ్లీగా కనపడరు చూడడానికి చాలా అందంగా కనిపిస్తారు. పైగా అందరికంటే అందంగా కనపడతారు. మరి తొడలు ఎక్కువగా ఉన్నవాళ్లు ఎలాంటి కీ బట్టలు వేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

తొడలు ఎక్కువ ఉంటే ఎ లైన్ స్కర్ట్, అనార్కలీ వంటివి మీ పియర్ బాడీకి సూట్ అయ్యే విధంగా వేసుకోవడం మంచిది. కాస్త ఒళ్ళుగా ఉన్నవాళ్లు ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తే బెస్ట్. బాగా కనపడతారు.
తొడ భాగం ఎక్కువగా ఉన్నవారు టైట్ జీన్స్ ని వేసుకోకూడదు. కాస్త వదులుగా ఉన్న జీన్స్‌ని ఎంపిక చేసుకోండి. అప్పుడు అందంగా వుంటారు. స్లిమ్ ఫిట్ జీన్స్, డెనిమ్ షార్ట్స్‌తో కంపేర్ చేస్తే వైడ్ లెగ్ జీన్స్ తొడ భాగాల్ని కవర్ చేస్తాయి. సో వీటిని వేసుకోండి.
హాఫ్ షోల్డర్ టాప్ లని వేసుకోండి. ఇలా చేస్తే ఫోకస్ అటు వెళ్తుంది. ప్యాంట్ ని పెద్దగా గమనించారు. సో ఇలా చెయ్యండి.
తొడలు వెడల్పుగా ఉన్న వారికి లూజ్‌గా ఉన్న కాటన్ షార్ట్స్ సెట్ అవుతాయి. బాగా కనపడతారు.