విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఘటన చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో చోటు చేసుకుంది. బంగారు పాళ్యం మండలం చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలోఅబు అనే టీచర్ పనిచేస్తున్నాడు. ఇతడు 4, 5 తరగతులు చదువుతున్న 11 మందివిద్యార్థులను లైంగికంగా వేధించేవాడు. వారిపట్ల పైశాచికంగా ప్రవర్థించి, చిత్ర హింసలు పెట్టేవాడు.
తల్లిదండ్రులు, ఇతరులెవరికైనా ఈ విషయాన్ని చెబితే.. టీసీ ఇచ్చి పంపేస్తానని, చాక్ పీసుకు ఓ తాడు ముడివేసి.. ఆ తాళి కట్టేస్తానని భయపెట్టేవాడు. దువ్వెనతోవారితలలు దువ్వి, పౌడర్రాసి, బొట్టుబిల్లలు పెట్టేవాడని విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం చిత్తూరు ఆర్డీవో రేణుక, డీఈవో పురుషోత్తం, ఎంఈవో నాగేశ్వరరావు, తహసీల్దారు సుశీలమ్మ, గ్రామస్తుల సమక్షంలోవిలపించారు. వెంటనే స్పందించిన డీఈవో సదరు టీచర్ ను సస్పెండ్ చేస్తున్నట్లుప్రకటించారు. అతడిపై ఫోక్సో కేసు నమోదు చేసి..తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులను ఆర్డీవో ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతన్ని అరెస్టు చేశారు.