చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3,688 నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,075,864 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2755 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.74 శాతంగా ఉంది.
ఇక దేశంలో తాజాగా 50 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,23,803 కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,33377 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,88,89,90,935 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 22,58,059 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 18,684 కు చేరింది.
COVID19 | 3,688 new cases in India today; Active caseload rises to 18,684 pic.twitter.com/9NB1foJONC
— ANI (@ANI) April 30, 2022