వైసీపీకి నెల్లూరు ఎంపీ ఆదాల రాజీనామా..క్లారిటీ ఇదే !

-

వైసీపీకి నెల్లూరు ఎంపీ ఆదాల రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై ఆయనే స్వయంగా స్పందించారు. తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ‘నేను పార్టీ మారుతున్నట్లు రాజకీయ ప్రత్యర్ధులు దుష్ప్రచారం చేస్తున్నారు.

adala prabhakar reddy clarity on party change

నేను టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. వైసీపీలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నెల్లూరు(R) ఇన్చార్జిగా నియమించి పార్టీ నాకు గుర్తింపు ఇచ్చింది. ఇంత ప్రాధాన్యమిస్తున్న వైసీపీని వీడాల్సిన అవసరం లేదు’ అని ఆయన వెల్లడించారు.

ఇక అటు జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరబోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని, తాను వైసీపీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. వదంతులు నమ్మవద్దని కోరారు. కాగా, జగ్గయ్యపేట టికెట్ ఈసారి ఉదయభానుకు కాకుండా కొత్త వారికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరి, పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news