తీగలాగడం మెల్లగా మొదలెట్టిన జగన్… బాబు డొంక భవిష్యత్తు?

-

హాయిగా అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టుకుని, అవినీతికి తావులేకుండా, అక్రమాలకు అవకాశం లేకుండా బాబు పాలన సాగిస్తారని, తాను సీనియర్ అని జనం నమ్మారు… ఆ నమ్మకం వంచనకు గురైందన్న ఆరోపణలకు సంబందించిన వాస్తవ విషయాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి.

JAGAN

జగన్ మొదటినుంచీ చెబుతున్న మాట… అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని. నాటి అధికారపార్టీ నేతలు అప్పనంగా రైతుల దగ్గర వందల ఎకరాలు 10 – 15 లక్షలకు కొనేసి.. అనంతరం రాజధాని ప్రకటన చేశారని! ఇలా చెప్పుకుంటూపోతే లిస్ట్ పెద్దదే అవుతుంది… ఒక్కమాటలో చెప్పాలంటే రాజధాని పేరుచెప్పి.. చెప్పలేనన్ని అక్రమాలు జరిగాయని, అవినీతికి కేంద్రంగా అమరావతి ప్రాజెక్ట్ నిలిచిందని!

ఈ విషయాలపై టీడీపీ నేతలు స్పందించరు! సరికదా… రాజధానికి అమరావతి నుంచి తరలించొద్దని ధర్నాలు, దీక్షలు అంటూ అమాయకులైన రైతుల పేరుచెప్పి… రియల్ ఎస్టేట్ దీక్షలు చేయిస్తుంటారు అనే విమర్శ ఉంది! కానీ… అవేమీ జనాలకు తెలియదన్నట్లుగా… జగన్ సర్కార్ ని మాత్రం తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటారు! రైతుల పొట్టకొడుతున్నాడని.. అమరావతి తన స్వప్నమని.. ఆంధ్రుల ఆశాదీపం అని.. జగన్ ఆ కలను చెరిపేశారని.. దీపాన్ని ఆపేశారని ఆరోపిస్తుంటారు! కానీ.. ఈ విమర్శలకు జగన్ నుంచి మాటలతో సమాధానం రాలేదు… నేడు చేతలతో వచ్చేసింది!

అవును… గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న రాజధాని భూ కుంభకోణానికి సంబందించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా మెలిగిన తుళ్లూరు రిటైర్డ్‌ తహసిల్దార్‌ సుధీర్ ‌బాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు! ఈయనతోపాటు… అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసిన గుమ్మడి సురేశ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది సీఐడీ! దళితులు సాగుచేసుకుంటున్న అసైన్డ్‌ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన నేపథ్యంలో సురేశ్‌ ని అరెస్టు చేయగా… భూ రికార్డుల తారుమారు వ్యవహారంలో సుధీర్ బాబుని అరెస్టు చేశారు!

దీంతో… రాజధాని భూ కుంభకోణం వ్యవహరంపై జగన్ తీగ లాగడం స్టార్ట్ చేశారని… అంతా అనుకూలంగా జరిగితే మరికొన్ని రోజుల్లో డొంకంతా కదిలే సూచనలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు! తుళ్లూరు తహసిల్దార్ తో మెల్లగా మొదలైన ఈ అరెస్టుల పర్వం ఎవరివరకూ వెళ్లి ఆగుందనేది వేచి చూడాలి! ఏది ఏమైనా… అమరావతి భూ కుంభకోణం విషయంలో జగన్ “మెల్లగా మొదలెట్టేసినట్లే..” ఇది ఫిక్స్!!

Read more RELATED
Recommended to you

Latest news