మహిళా రైతుల మాట: గాజులేసుకుని ఇంట్లో కూర్చోండి…!

-

ఏపీలో అమరావతి పేరు చెప్పి చంద్రబాబు రాజకీయం దాదాపు ముగిసినట్లేనని కామెంట్లు వినిపిస్తోన్న నేపథ్యంలో… “టీడీపీ నేతలారా.. రాజధానిలోనే అమరావతి అని చెప్పి.. రైతుల దగ్గర భూములు తీసుకుని.. ఉన్న ఐదేళ్లు గ్రాఫిక్స్ కోసం ఖర్చుపెట్టి.. నేడు జగన్ కు అవకాశం ఇచ్చి, ప్రభుత్వంపై ఒత్తిడి తేలేక.. నేడు మమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఆన్ లైన్ లో మీటింగులు పేడుతు సూచనలు చేస్తున్నారా” అంటూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!!

ఇది ఖచ్చితంగా ఊహించని పరిణామనే చెప్పాలి! రాజధాని ప్రాంతంలో రైతులుగా, రాజధానికోసం మూడు పంటలు పండే భూముల రైతులుగా తమ బాద తమకుందని… తాము కేవలం అధికార పక్షాన్నో, బీజేపీనో విమర్శించి తప్పించుకునే నాయకుల్లా కాదని చెబుతున్నారు. నేడు తాము పడుతున్న బాదకు, ఆవేదనకు చంద్రబాబు ప్రథాన ముద్దాయి, ప్రథమ ముద్దాయి అని రైతులు వాపోతున్నారు. దీంతో ఫైరయిన రాజధాని ప్రాంత మహిళలు… “గాజులేసుకుని, చీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని ఇంట్లో కూర్చోండి” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మమ్మల్ని నమ్మించి, భూములు తీసుకున్న నాయకుల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ లేదంటూ… గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, చీర బహుమతిగా ఇస్తున్నట్లు మహిళా రైతులు ప్రకటించారు! అమరావతి ద్రోహులైన గుంటూరు, కృష్ణా జిల్లాల రాజకీయ నేతలతో పాటు.. తమను నమ్మించి తమ భూములను అటూ ఇటూ కాకుండా చేసిన చంద్రబాబు & కో లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు రైతులు!!

Read more RELATED
Recommended to you

Latest news