పోలవరం నిర్వాసితుల్లో ఇళ్లు కోల్పోయిన వారికే రూ.10 లక్షలు ఇస్తామని జగన్ సర్కార్ పేర్కొంది. పోలవరం నిర్వాసితుల పరిహరం చెల్లింపుపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో చర్చ జరిగింది. పోలవరం రూ. 10 లక్షలు ఎకరానికి చెల్లిస్తానన్నారా..? లేదా..? అనే అంశంపై ప్రశ్నలు సంధించింది టీడీపీ. దీనిపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… 2013 చట్టానికి ముందు కేవలం రూ. 1.50 లక్షలు పరిహరం పొందిన వారికి రూ. 5 లక్షలిస్తామన్నారు.
ఆ కేటగిరిలో ఉన్న వారికి మిగిలిన రూ. 3.50 లక్షలు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కొల్పోయిన వారికి మొత్తంగా రూ. 10 లక్షలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని.. ఇందులో కేంద్రం సుమారు రూ. 7.50 లక్షలు ఇస్తుంది.. వారికి మిగిలిన రూ. 2.50 లక్షలిస్తామని హామీ ఇచ్చిందని వివరించారు. భూములు కోల్పోయిన వారికి రూ. 10 లక్షలిస్తామనే హామీనే ఇవ్వలేదని.. భూములకు రూ. 10 లక్షలు ఇస్తామనే హామీ ఇవ్వనప్పుడు ఎన్ని ఎకరాలు అనే ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పారు.