‘నీతో’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన హను రాఘవపూడి

-

‘నీతో’ సినిమా ట్రైలర్ విడుదలయింది. డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు. జీవితానికే కాదు.. ఇద్దరు జీవితాలను ఒక్కటిగా చేసే వివాహా బంధానికి కూడా బీమా ఉండాలంటే వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా నటించారు. బాలు శర్మ దర్శకత్వంలో పృథ్వీ క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ సంయుక్తంగా నిర్మించింది.

‘నీతో’ ట్రైలర్ ఆద్యంతం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని హను రాఘవపూడి అన్నారు. ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. వివేక్ సాగర్ ఈ చిత్రాన్ని సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

మరోవైపు హను రాఘవపూడి ఇటీవలే తెరకెక్కించిన చిత్రం సీతారామం ఓవైపు కలెక్షన్లలో మరోవైపు సినీ ప్రియులను ప్రేమతో కట్టిపడేస్తూ దూసుకెళ్తోంది. ఓవైపు థియేటర్​కు వెళ్తూనే మరోవైపు ఓటీటీలో ఈ సినిమాను ప్రేక్షకులు లెక్కలేనన్ని సార్లు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news