ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్. ఏప్రిల్ లో విద్యుత్ చార్జీలు పెంపు లేదని ప్రకటన చేసింది ఏపీ సర్కార్. దీంతో ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ఏపీలో విద్యుత్ చార్జీలు పెంపు లేదని ప్రకటించింది APERC. డిస్కంలు లోటును భరించేందుకు అంగీకరించింది జగన్ ప్రభుత్వం. రాయితీలపై విద్యుత్ కు సంబంధించిన ఎటువంటి మార్పులు లేవని తెలిపారు APERC చైర్మన్ నాగార్జున రెడ్డి.
2023-24 సవరించిన టారిఫ్ విధానం ప్రకటించిన APERC చైర్మన్ నాగార్జున రెడ్డి…..
పవర్ లూమ్స్, పిండి మిల్లులుకు మినహాయింపులు ఇస్తున్నట్లు వివరించారు. 10వేల కోట్ల రూపాయల పైగా సబ్సిడీ భారం ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు APERC చైర్మన్ నాగార్జున రెడ్డి. అటు తెలంగాణ రాష్ట్రంలోనూ అక్కడి ప్రజలకు ఇదే తరహా నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం.