ఈ నెల మూడో వారంలో ఏపీ అసెంబ్లీ.. అందుకేనా ?

ఈ నెల మూడవ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అందుకు సంబంధించి ఎల్లుండి అంటే ఐదో తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి అనే విషయాన్ని కేబినెట్ భేటీలో ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వెనుక బలమైన కారణం ఉందని అంటున్నారు.

అదేంటంటే ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడతాయని ఎన్నాళ్ల నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగా గత ఏడాది ఏర్పడిన జగన్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా ఏపీలో కొత్త జిల్లాల బిల్లు పాస్ చేయడం కోసమే అనే వాదన వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయని తెలియాల్సి ఉంది. అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని తప్పుపడుతూ వస్తున్న ప్రతిపక్షమైన తెలుగుదేశం ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తుందా ? లేకపోతే ఎప్పటిలానే విభేదిస్తున్న అనేది ఆసక్తికరంగా మారింది.