పదో తరగతి ఫలితాల్లో 72.26% ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి బొత్స ప్రకటించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్య రుసుము రూ.50 తో ఈనెల 22 వరకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈనెల 13 వరకు అప్లై చేసుకోవాలని మంత్రి సూచించారు. పరీక్షలు పూర్తి అయిన 18 రోజుల్లో ఫలితాలను విజయవంతంగా విడుదల చేశామని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఎలాంటి లీకేజీలు లేకుండా మొత్తం ప్రక్రియ నిర్వహించామని వెల్లడించారు.
ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అందరికీ అభినందనలు చెప్పారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. భావోద్వేగాలకు లోనై విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. మీరు మళ్ళీ విజయం సాధిస్తారని.. ప్రతి ఓటమి గెలుపుకు బాట వేస్తుందని వెల్లడించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.