ఏపీ సీఎం చంద్రబాబు మరో శ్వేత పత్రం విడుదల

-

భూములు, గనులు, అటవీ వనరులపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో అడ్డగోలుగా భూదోపి, గనుల దోపిడి, సహజ వనరుల దోపిడీ అడ్డగోలుగా జరిగింది. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను తీసుకొచ్చారు. ఇసుక దందాపై ప్రశ్నించే వారిపై అట్రాసిటీ కేసులు పెట్టేవారు.

భూములు లాక్కున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనింగ్ విషయంలో భారీగా పెనాల్టీలు వేశారు. నిబంధనలు పాటించకుండా మైనింగ్ లో దోపిడి చేశారు. గత ప్రభుత్వ హయాంలో పంచ భూతాలను కూడా మింగేశారు. వైసీపీ ప్రభుత్వం కొత్త విధానంతో దోపిడీ చేసింది. 23 పార్టీల ఆఫీస్ లతో అక్రమాలకు పాల్పడ్డారు. హైదరాబాద్ ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. గ్రామాల్లో ఉండే ఖాళీ భూములను సైతం కబ్జా చేశారు. ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినయోగం చేయడమే. విశాఖకి వస్తే.. రిషికొండ చూసాక విశాఖ వచ్చాం అనేవారు. విశాఖలో ఎర్రదుబ్బలు అన్నీంటిని కబ్జా చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news