శభాష్ జగన్: ఆర్టీసీ సిబ్బందిని కాపాడిన సీఎం నిర్ణయం!

-

విజన్ విజన్ అంటారు కానీ.. అదీ పదేళ్లకో పాతికేళ్లకో ఉంటేనే కాదు… రేపంటే రేపటి గురించి ఆలోచించడం కూడా విజనే! జనాలను భ్రమల్లో బ్రతికించే క్రమంలో చెప్పే “విజన్” మాటలు జగన్ చెప్పరు.. సరికదా రేపు ఎంతముఖ్యమే నేడు అంతకంటే ముఖ్యమనే క్రమంలో చేసుకుపోతుంటారు. ఆ క్షణం ఆ నిర్ణయం విలువ తెలియకపోయినా… సరైన సమయంలో సరైన విధంగా జగన్ ముందుచూపు ఫలితాలు రోజు రోజుకీ వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చింది.. ఆర్టీసీ సిబ్బంది విషయంలో జగన్ ముందుచూపు!

 

తాను నమ్మిన, తనను నమ్మినవారు ఎవరూ ఇబ్బందులు పడకూడదని.. సామాన్యులకు సంక్షేమ ఫలాలు.. వేతన జీవులకు సరైన సమయానికి జీతాలు అందించే ఆలోచనతో ముందుకు పోతున్నారు జగన్. ఈ క్రమంలో ప్రస్తుతం గత కొతంకాలంగా కరోనా కారణంగా ఆర్టీసీ సేవలు అందుబాటులో లేవు. దీంతో ఆర్టీసికి కొన్ని వందల కోట్ల అదాయం కోల్పోవలసిన పరిస్థితి ఎదురైంది. మరి ఆర్టీసీ సిబ్బంది జీతాల పరిస్థితి?

కరోనా నేపధ్యంలో బస్సులు డిపోలకే పరిమితమైన నేపధ్యంలో… మే 21 నుంచి సర్వీసులు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రెండు నెలల కాలంలో కేవలం రూ. 104 కోట్ల ఆదాయం మాత్రమే ఆర్టీసికి వచ్చింది. గతేడాది ఇదే కాలానికి రూ. 854 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే… సుమారు రూ. 750 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ ఈ కరోనా మహమ్మారి వల్ల కోల్పోయింది. ఈ లెక్క ప్రకారం… రెండు నెలలకు కేవలం రూ. 104 కోట్లే వస్తే.. చెల్లించాల్సిన జీతాలు మాత్రం నెలకు రూ. 300 కోట్లు!!

ఈ సమయంలో దేవుడి దయవల్ల జగన్.. ఆర్టీసీ సిబ్బందిని ఇటీవల ప్రభుత్వంలో విలీనం చేయడంతో తమ వేతనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయ్యిందని అంటున్నారు ఆర్టీసీ సిబ్బంది. కేవలం రెండు నెలలకు 104కోట్ల రూపాయలే ఆదాయం వచ్చిన కూడా… ఆర్టీసీ సిబ్బంది వేతనాలను ఆపలేదు ప్రభుత్వం. దీంతో కరోనా కష్టకాలంలో కూడా ఆర్టీసి సిబ్బంది కుటుంబాలు ఆనందంగా గడపగలుగుతున్నాయి. థ్యాంక్యూ సీఎం గారూ అని చెబుతున్నాయి అర్టీసీ సిబ్బంది కుటుంబాలు!!

Read more RELATED
Recommended to you

Latest news