జ‌గ‌న్ కేబినెట్‌లో ఇంప్రెస్డ్ మినిస్ట‌ర్స్‌.. గ్రాఫ్ ఎలా ఉందంటే..!

-

ఏపీ సీఎం జ‌గ‌న్ కేబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. అనేక సుదీర్ఘ ల‌క్ష్యాలు.. ప్ర‌జా కోణం లో జ‌గ‌న్ వీరిని ఎంపిక చేసుకున్నారు. కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గానికి మాత్ర‌మే పెద్ద పీట వేశాను.. అనే అప‌ప్ర‌ద రాకుండా కూడా ఆయ‌న జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. దాదాపు అన్ని సామాజిక వ‌ర్గాల‌కు కూడా పెద్ద పీట వేశారు. అదేస‌మ‌యంలో పార్టీ ప‌రంగా చూసుకున్నా.. సీనియ‌ర్లు, జూనియ‌ర్లు.. అనే తేడా లే కుండా.. కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అదేస‌మ‌యంలో కొంద‌రు అత్యంత కీల‌క‌మ‌ని భావించిన‌ప్పుడు.. వారు జూనియ‌ర్లే అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారు.

ys jagan mohan reddy new plan to develop his party in every constituency

ఇలా ఏర్పాటు చేసుకున్న మంత్రి వ‌ర్గంపై సీఎం జ‌గ‌న్‌తో పాటు.. ప్ర‌జ‌లు, ఆయా సామాజిక వ‌ర్గాల‌కు చెం దిన వారు కూడా చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి ఇప్పుడు వీరు ప‌ద‌వులు స్వీక‌రించి ఏడాది పూర్త యింది. ఈ ఏడాది కాలంలో ఏం చేశారు?  మంత్రుల కెరీర్ గ్రాఫ్ ఏ రేంజ్‌లో దూసుకుపోయింది.. అనే విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. మంత్రుల్లో ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే.. త‌మ‌కు అప్ప‌గించిన ప‌నిని అప్ప‌గిం చిన‌ట్టు చేసుకుపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అంటే.. వీరు కేవ‌లం… అర్జ‌నుడికి పిట్ట‌క‌న్ను మాత్ర‌మే క‌నిపించి న‌ట్టు.. త‌మ శాఖ‌కు చెందిన ప‌ని మాత్ర‌మే క‌నిపిస్తోంది. మ‌రికొంద‌రికి వారి ప‌నితోపాటు.. సీఎం జ‌గ‌న్‌ను ఇంప్రెస్ చేయాల‌నే త‌హ‌త‌హ క‌నిపిస్తోంది.

ఇక‌, చాలా మందిమంత్రులు.. ప‌నిక‌న్నా కూడా .,. సీఎం జ‌గ‌న్‌ను ఇంప్రెస్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నా ర‌ని ప్ర‌తిప‌క్షాల నుంచి స్వ‌ప‌క్షం వ‌ర‌కు విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇక‌, ఈ మంత్రులు చూసే ఆయా శాఖల ఉన్న‌తాధి కారులు కూడా ఇదే విష‌యాన్ని ఆఫ్‌ది రికార్డుగా మీడియా మిత్రుల‌కు చెబుతున్నారు. “మా ద‌గ్గ‌ర ఇంతే!  ప‌ని కొంచెం లేట‌యినా.. ఫ‌ర్వాలేదు. సీఎంగారిపై రెండు స్త్రోత్రాలు చేస్తే చాలు“ అని కొంద‌రు ఐఏఎస్ స్థాయి అధికారులే చెప్పుకొంటున్నారు.

ఇక‌, మ‌రికొంద‌రు మంత్రులు.. ఏం జ‌రిగినా.. కూడా మౌనంగా ఉంటున్నారు. “మాకెందుకు.. చూస్తూ ఉంటే పోలా..“ అని అనేస్తున్నారు. ఇక‌, వేళ్ల మీద లెక్కించుకునే స్థాయిలో ఇంకొంద‌రు మంత్రులు చాలా దూకుడుగా ఉంటున్నారు. ఇది కూడా ఇంప్రెస్ చేయ‌డంలో భాగ‌మేన‌ని అంటున్నారు. మొత్తానికి ఈ మంత్రుల గ్రాఫ్ అనుకున్న రేంజ్‌లో పైపైకి మాత్రం వెళ్ల‌క‌పోవ‌డం గమ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news