వైఎస్ రుణాన్ని తీర్చేస్తున్న జ‌గ‌న్‌.. ఇంత ప్రేమా..?

-

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న కుమారుడు, సీఎం జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం భారీ ఎత్తున నిర్వ‌హిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు.కానీ, ఈ రేంజ్‌లో వైఎస్ కుమారుడిగా జ‌గ‌న్ త‌న తండ్రి రుణాన్ని తీర్చుకుంటార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. గ‌తంలో వైఎస్ పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలో రైతుల క‌ష్టాలు తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలోనే వారికి అనుకూల‌మైన అనేక నిర్ణ‌యాలు తీసుకున్నారు. రుణాల నుంచి పంట‌ల స‌బ్సిడీల వ‌ర‌కు, అదేస‌మ‌యంలో విద్యుత్ నుంచి వాట‌ర్ వ‌ర‌కు కూడా అనేక కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏడు గంట‌ల పాటు ఉచిత విద్యుత్‌ను అందించారు వైఎస్‌.

రుణాల విష‌యంలోనూ లిబ‌ర‌ల్‌గా వ్య‌వ‌హ‌రించారు.  రైతుల పాలిట ప‌క్ష‌పాతిగా వైఎస్ గుర్తింపు సాధించారు. ఇదే ఆయ‌న‌ను రెండో సారి కూడా అధికారంలోకి తీసుకువ‌చ్చింద‌నేది వాస్త‌వం. అయితే, అనూహ్యంగా వైఎస్ మ‌ర‌ణంతో రైతులు క‌ష్టాల్లో కూరుకుపోయారు. త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వాలు రైతుల ప‌క్ష‌పాతుల‌మే నని ప్ర‌క‌టించినా.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం చూపించ‌లేక పోయాయి. గ‌త చంద్ర‌బాబు ప్ర‌బుత్వం కూడా రైతు ల‌ను అడ్డుపెట్టుకునే అధికారంలోకి వ‌చ్చింది. వారికి రుణ మాఫీని కూడా ప్ర‌క‌టించింది. అయితే, గెలిచి అధికార పీటం ఎక్కిన త‌ర్వాత మాత్రం రైతుల విష‌యంలో చంద్ర‌బాబు అనేక పిల్లి మొగ్గ‌లు వేశారు.

వారికి చేస్తాన‌న్న రుణాల మాఫీకి కూడాఅ నేక లొసుగులు పెట్టారు. అదేస‌మ‌యంలో అనేక చోట్ల బూము లు తీసుకుని కూడా వారికి ప‌రిహారం ఇవ్వ‌లేక పోయారు. ఏడుగంట‌లుగా ఉన్న ఉచిత విద్యుత్‌ను తొమ్మి ది గంట‌లుగా పెంచారు. అయితే.. దానిని కూడా అమ‌లు చేయ‌లేక పోయారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. తాను అమ‌లు చేస్తున్న కొత్త ప‌థ‌కాల‌కు తోడుగా.. గ‌త ప్ర‌భుత్వం అమ‌లు చేస్తాన‌ని చెప్పి.. చేయ‌కుండా పెండింగ్‌లో పెట్టిన అనేక అంశాల‌ను కూడా పూర్తి చేస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా రైతుల కోసం ప్ర‌త్యేకంగా ఒక దినోత్స‌వాన్ని నిర్వ‌హించ‌డం, రైతు భ‌రోసా కేంద్రాల‌ను గ్రామ గ్రామాన ఏర్పాటు చేయ‌డం వంటి కీల‌క ప‌రిణామాలు.. నిజంగా వైఎస్ క‌ల‌లు క‌న్న రైతు సామాజ్రం ఏర్పాటు చేయ‌డంలో భాగ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే వైఎస్ రుణాన్ని జ‌గ‌న్ తీర్చేసుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news