డ్రగ్స్‌ అరికట్టేందుకు ఏపీ డీజీపీ సంచలన నిర్ణయం..ఇక వారి తోలు తీయడమే !

-

డ్రగ్స్‌ అరికట్టేందుకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తానని..యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంను త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని… ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని హెచ్చరించారు.

ap dgp tirumala rao, ap

సవరణ చేసిన మూడు నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తున్నామని…రాష్ట్రంలోని ప్రధానమైన నగరాల్లో మరిన్ని సి.సి.కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో పోలీసులు ఉపయోగించే పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తాం… పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తున్నామని తెలిపారు. పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం…. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా..పోలీసు అధికారులతో సమావేశమవుతానని చెప్పారు.
పౌరులను మెరుగైన సేవలు అందిస్తాం… సమాజానికి..ప్రజలకు జవాబుదారితనంగా పనిచేస్తామని పేర్కొన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.

Read more RELATED
Recommended to you

Latest news