ఆంధ్రప్రదేశ్ లోని మంత్రుల రాజీనామాలను ఆమోదించారు గవర్నర్. కొత్త క్యాబినెట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత మంత్రుల రాజీనామాలు శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నాయి. నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించారు.దీంతో పాటుు కొత్తమంత్రుల జాబితా తన వద్దకు రాగానేే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపనున్నారు.కాగా ఇప్పటికే కొత్త మంత్రుల లిస్ట్ కూడా ఫైనల్ అయింది.కానీ పేర్లు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.
అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణలో పాత పది మంది మంత్రులు కొనసాగనున్నారు.అనుభవం, సామాజిక సమీకరణ, జిల్లా ప్రాతినిధ్యం అవసరాలే ప్రాతిపదికన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, కొడాలి నాని, గుమ్మనూరు జయరాం, సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, పేర్ని నాని లు కొనసాగనున్నట్లు సమాచారం.అయితే ఈరోజు సాయంత్రానికి తుది జాబితాను రూపొందించి రేపు ప్రమాణ స్వీకారానికి రావాలని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రత్యేకంగా కొత్త మంత్రులను ఆహ్వానిస్తారని సమాచారం.