ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్షకు ఏర్పాట్లు…. రాజధానికి పయణమైన ప్రజాప్రతినిధులు

-

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం పోరు సాగిస్తోంది. ఇప్పటికే ఉగాది తర్వాతి రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని పలు రకాలుగా నిరసన, ఆందోళనలు చేస్తోంది. తాజాగా రేపు దేశరాజధాని ఢిల్లీలో భారీ ధర్నాకు టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. ఢిల్లీలోని తెలంగాణ రేపు టీఆర్ఎస్ దీక్ష చేపట్టనుంది. ఇప్పటికే వారం రోజులుగా సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం పెట్టారు. 

తెలంగాణలోని మండల స్థాయి నుంచి ఎంపీల దాకా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి పయణం అవుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు అంతా ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీక్షకు సంబంధించి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ భవన్ లో ఎండ తీవ్రత తక్కువగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రంపై ఒత్తడి తీసుకువచ్చేందుకు ఢిల్లీ వేదికగా దీక్ష చేయనున్నారు. కేంద్రం ఎంఎస్పీ అమలు చేయాలని… కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అయితే ఈ దీక్షకు సీఎం కేసీఆర్ వస్తారా…? లేదా..? అనేదానిపై క్లారిటీ లేదు. కేసీఆర్ పంటి నొప్పి కారణంగా ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు. రేపు ఉదయం మాత్రమే కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news