ఏపీ రైతులకు గుడ్ న్యూస్… రేపే ఖాతాల్లోకి డబ్బులు

-

ఏపీ రైతులకు గుడ్ న్యూస్…ఈనెల 31న వైయస్సార్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వరుసగా ఏడో ఏడాది కౌలు రైతులతో పాటు దేవాదాయ భూములు సాగుచేసే వారికి రైతు భరోసా నిధులను అందించనున్నారు.

సిసిఆర్సిలు పొందిన వారిలో అర్హులైన 1,42,693 మంది కౌలుదారులతో పాటు 3,631 మంది దేవాదాయ భూముల సాగుదారుల ఖాతాల్లో తొలి విడతగా రూ.7500 చొప్పున రూ.109.74 కోట్లను జమ చేయనున్నారు.కాగా, ఇవాళ కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మో‌‌హన్‌రెడ్డి పర్యటించనున్నారు. కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగ్గంపేట మండలం ఇర్రిపాక చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news