ముచ్చుమర్రి బాలిక పై అత్యాచారం, హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నంద్యాలలో యోహాను(35) అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడు ముచ్చుమర్రి వాసిగా గుర్తించారు పోలీసులు. ముచ్చుమర్రి బాలిక పై అత్యాచారం, హత్య కేసులో యోహాను ను పోలీసులు విచారించినట్టు సమాచారం అందుతోంది.

యోహాను ఆత్యహత్య చేసుకున్నారా…ఇంకా ఏమైనా జరిగిందా అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. యోహాను మృతదేహంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. గాయాలతో నంద్యాల జిజిహెచ్ కు తరలించారు. ఇక పోస్టుమార్టం కోసం మృతదేహం తరలించారు. ఈ తరుణంలోనే జిజిహెచ్ లో మీడియాపై ఆంక్షలు విధించారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈనెల 7వ తేదీ నుంచి అదృశ్యమైంది బాలిక. ముచ్చుమర్రికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారణ చేశారు పోలీసులు. కానీ ఇప్పటి వరకు బాలిక మృత దేహం దొరకలేదు.