ఏపీలో 19.7% మందికి కరోనా వచ్చిపోయిందట !

-

ఏపీలో నిర్వహించిన సీరో సర్వైలెన్స్‌ సర్వే ఫలితాలను వెల్లడించారు. ఈ సీరో సర్వైలెన్స్‌ సర్వే ద్వారా రాష్ట్రంలో 19.7 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని నిర్ధారణ అయింది. పురుషుల్లో 19.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు, మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ అయింది. కోవిడ్ వచ్చినట్లు కూడా వారికి తెలీదని అధికారులు చెబుతున్నారు. వివిధ వర్గాల ప్రజల నుంచి శాంపిల్స్ తీసుకున్నామని 45 వేల మంది నుంచి ఈ సీరో సర్వైలెన్స్‌ శాంపిల్స్ తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.

ఏ లక్షణాలు లేని వారి నుంచి శాంపిల్స్ తీసుకున్నామని అలా ఈ సీరో సర్వైలెన్స్‌ సర్వే చేయగా 19.7% మందికి కరోనా వచ్చిపోయినట్టు గుర్తించామని పేర్కొన్నారు. పట్టణాల్లో 22.5 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్లు ఈ సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 18.2 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు ఈ సర్వేలో తేలింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో 20.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు ఈ సర్వేలో తేలింది. నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో 19.3 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు ఈ సర్వేలో తేలింది. రాష్ట్రంలో కరోనా వచ్చిపోయిన వారిలో 20.3 శాతం మంది హైరిస్క్‌లో ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news