పదవులపై తమ్ముళ్ల లొల్లి ? బాబు కి పోయేదేంటి ?

-

తెలుగుదేశం పుట్టి మునిగేలా కనిపించడంతో ఏదోరకంగా పార్టీ నాయకులు ఉత్సాహం రేకెత్తించి 2024 ఎన్నికల నాటికి అధికారం సంపాదించే అంత స్థాయిలో బలపడాలనే ఆలోచనతో టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ పదవులను భర్తీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర కార్యవర్గం లోకి నాయకులను తీసుకున్నారు. అలాగే పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి ల పాటు, సభ్యులను పెద్ద సంఖ్యలోనే తీసుకున్నారు. పార్టీలో ఒక వెలుగు వెలిగిన వారందరికీ, కాదు లేదు అనకుండా పదవులను కట్టబెట్టారు. అయితే వీరి వల్ల తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమి లేకపోయినా, తమకు పదవులు ఉన్నాయన్న ఉత్సాహంతో పార్టీ తరఫున యక్టివ్ అవుతారని బాబు భావిస్తున్నారు.
 ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో ముందుకు వచ్చి పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకు వస్తారని, ఇలా ఎన్నో లెక్కలు వేసుకుని మరి బాబు ఈ కమిటీల నియామకం చేపట్టారు. దీంతో పాటు పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు వలస వెళ్లే అవకాశాలు ఉండడం,  వైసిపి నాయకులతో ఇప్పటికే పార్టీ మారే విషయమై చర్చలు జరుపుతున్న డం వంటి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు పార్టీ కమిటీలను అర్జెంటుగా భర్తీ చేశారు. అయితే ఇందులోనూ కొంతమంది నాయకులు తమకు సరైన ప్రాధాన్యం దక్కలేదని, తమ హోదాకు తగ్గట్టుగా పదవి ఇవ్వలేదని, మరికొందరు అధిష్టానం తమకు ఏ పదవి ఇవ్వలేదని, తాము ఇన్నాళ్లూ సేవ చేస్తే పూర్తిగా పక్కన పెట్టేశారు అంటూ అదే పనిగా విమర్శలు చేస్తున్నారు.
కొంతమంది పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళి పోతూ ఉండటం వంటి వ్యవహారాలు ఇప్పుడు కొత్త తలనొప్పులు తీసుకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పెద్దఎత్తున చేపట్టిన పార్టీ పదవులు వల్ల నాయకులకు పెద్ద కలిగే ప్రయోజనం ఏమి ఉండదు అనేది బహిరంగ రహస్యమే. కేవలం ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తారు అనే అభిప్రాయంతోనే ఈ పదవులను భర్తీ చేశారు అనే విషయాన్ని మరిచిపోయి మరి ,నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా మీడియా లో హడావుడి చేస్తున్నారు. అయితే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వెళ్ళినంత మాత్రాన ,చంద్రబాబు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ పోయేది ఏమీ ఉండదు అంటూ కొంతమంది తెలుగు తమ్ముళ్లు చెప్పుకొస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news