BREAKING : ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

-

BREAKING : ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల అయింది. జూన్‌ 15 వ తేదీ నుంచి జూలై 15 వ తేదీ వరకు ఆన్‌ లైన్‌ లో ఫీజుల చెల్లింపు ఉంటుందని నోటిఫికేషన్‌ లో స్పష్టం చేసింది ప్రభుత్వం. అలాగే.. ఆగస్టు 6 వ తేదీను ఆగస్టు 21 వ తేదీ వరకు ఆన్‌ లైన్‌ లో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది సర్కార్‌.

ఆగస్ట్‌ 31 వ తేదీన ప్రైమరీ కీ విడుదల అవుతుందని.. సెప్టెంబర్‌ మాసం 12వ తేదీన ఫైనల్‌ కీ విడుదల కానుందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్. టెట్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం. http://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నోటిఫికేషన్, ఇన్ఫర్మే షన్ బులిటెన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుము, ఆన్లైన్ పరీక్ష సూచనలు వెబ్‌సైట్‌ ద్వా రా తెలుసుకోవచ్చ ని వెల్లడించారు కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news