ప్రైవేట్ సంస్థకే ఇసుక రీచ్ లు.. ఏపీ కీలక నిర్ణయం

ముందు నుండీ ప్రచారం జరిగినట్టుగానే ఏపీ కేబినెట్ కొత్త ఇసుక పాలసీకి ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రీచ్ లను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని అవి ముందుకు రాకపోతే ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్‌కమిటీ సిఫార్సు చేసింది.

అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవీ ఈ రీచ్ లను నిర్వహించందానికి ఆసక్తి చూపకపోవడంతో ఒక ప్రైవేట్ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యత అప్పగించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సబ్‌కమిటీ సిఫార్సులను క్యాబినెట్ లో కూలంకషంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రైవేటుకి అప్పగించే క్రమంలో ఓపెన్ టెండర్‌ ద్వారా ప్రక్రియ చేపట్టాలని కేబినెట్ కమిటీ నిర్ణయించింది.