కేంద్రం అందించిన కోవిడ్ డబ్బుని దారి మళ్లించారు – అశోక్ గజపతిరాజు

-

గడచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా ఒక్క ఇళ్లు కూడా నిర్మాణం జరగలేదన్నారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. పన్నులు విపరీతంగా పెంచారని ఆరోపించారు. కొత్త రకాల పన్నులను ప్రవేశపెడుతున్నారని అన్నారు. చెత్త పన్ను కట్టకపోతే రేషన్ కట్ …‌ పెన్షన్ కట్ అంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రేషన్ ఇస్తున్నారా లేదా తెలియడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలవుతున్నాయో లేవో తెలుయడం లేదని.. కేంద్రం అందించిన కోవిడ్ డబ్బుని దారి మళ్లించారని ఆరోపించారు.

మూడేళ్లలో ఒక్క ఇన్స్టిట్యూట్ ప్రారంభం కాలేదన్నారు. అమరావతి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు త్యాగం చేస్తే నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకి కోటి ఉంటుందని, రైతులకు మేలు చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పిందన్నారు. కానీ ఇక్కడ రైతుకి కేవలం ముప్ఫై లక్షలే ఇచ్చారని అన్నారు.

ఈ ప్రభుత్వం రైతుల నుంచి భూమి తీసుకొని వ్యాపారం చెయ్యడానికి చూస్తుందని ఆరోపించారు అశోక్ గజపతిరాజు. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టును పక్కన పెట్టేశారని.. నిధులు ఏమవుతున్నాయో అర్ధం కావడం లేదన్నారు. ఏ అంశం పైనైనా రాజ్యాంగ బద్దంగా చర్చి జరగాల్సి ఉంది… కానీ వీళ్లు చర్చించడానికి అవకాసం ఇవ్వడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news