కేబినెట్ వ్యవహారాలు కూడా సజ్జల చెప్పటం ఏంటి? : అయ్యన్నపాత్రుడు

-

అయ్యన్నపాత్రుడు మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ లు దగ్గరుండి నా ఇంటి కాంపౌండ్ వాల్ కొట్టించారు…ముందస్తు నోటీస్ ఇవ్వకుండా గోడ కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయ్యన్న పాత్రుడు. ప్రతి జిల్లాలో టిడిపి ప్రధాన నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు…అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఫైర్ అయ్యారు.

దొంగోడు చెప్తే పోలీసులు నీతిగా మమ్మల్ని దొంగలను చేస్తున్నారని ఆయన వివరించారు. సజ్జల కున్న నాలెడ్జ్ ఏంటి, సజ్జలకు ఏమి తెలుసు? సజ్జల కూడా ఒక సలహదారుడా ? అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రేంజ్ లో రెచ్చిపోయారు. క్యాబినెట్ వ్యవహారాలు కూడా సజ్జల చెప్పటం ఏంటి? సజ్జల మంత్రులను కూడా ప్రక్కన పెట్టేశాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది..రాష్ట్రంలో దోపిడీ జరుగుతుందన్నారు అయ్యన్నపాత్రుడు. మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు ఎందుకు పెట్టడం లేదు… యాచకుల దగ్గర కూడా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. మద్యం షాపుల్లో జరిగే దోపిడీ జగన్ ప్యాలెస్ కి వెళ్తుందని చెప్పారు అయ్యన్న పాత్రుడు.

Read more RELATED
Recommended to you

Latest news