నెక్స్ట్ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో చెప్పాల్సిన పని లేదు..అసలు జగన్‌ని గద్దె దించేసి తాను గద్దెనెక్కాలని చెప్పి తెగ ట్రై చేస్తున్నారు..పైగా నెక్స్ట్ గాని అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో బాబుకు తెలుసు…ఇప్పటికే ఒకసారి అధికారం కోల్పోయాక టీడీపీ పరిస్తితి ఏమైందో అర్ధం చేసుకోవచ్చు…జగన్ దెబ్బకు టీడీపీ పరిస్తితి చాలా దారుణంగా తయారైంది. మరి అలాంటప్పుడు రెండోసారి గాని జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ పరిస్తితి అంతే సంగతులు.
అందుకే ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు..జగన్ ప్రభుత్వం టార్గెట్‌గా రాజకీయం చేస్తున్నారు…నిత్యం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు..ఎలాగైనా జనాల్లో జగన్‌ని నెగిటివ్ చేయాలనే టార్గెట్ పెట్టుకుని ముందుకెళుతున్నారు…అలాగే ఇప్పటినుంచే టీడీపీ అభ్యర్ధులని ప్రకటించేస్తున్నారు…ఇంకా ఎన్నికలకు రెండేళ్ళు పైనే సమయం ఉండగానే..అభ్యర్ధులని సెట్ చేసుకుంటున్నారు..అంటే అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఏ విధంగా ముందు జాగ్రత్తలతో ముందుకెళుతున్నారో చెప్పాల్సిన పని లేదు.
ఇక జగన్‌పై జనాల్లో నెగిటివ్ ఎక్కువ ఉందనే కోణంలో బాబు రాజకీయం చేస్తున్నారు..అసలు జగన్ పాలన ప్రజలకు నచ్చలేదని, జగన్ పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే జగన్‌పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు..అయితే ఇదంతా బాబు భ్రమ అని చెప్పొచ్చు..ఎందుకంటే జనంలో ఇంకా జగన్ బలం తగ్గలేదు. ఇంకా ప్రజలు జగన్‌పై పాజిటివ్‌గా ఉన్నారు.
కాకపోతే ఇక్కడ వాస్తవం మాట్లాడుకోవాలి…గత ఎన్నికల్లో జగన్‌కు ఉన్న మద్ధతు..ఇప్పుడు మాత్రం లేదని చెప్పొచ్చు..అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు జగన్ బలం తగ్గింది..కానీ చంద్రబాబు కంటే ఆధిక్యంలోనే ఉన్నారు…అంటే ఇప్పుడు కూడా జగన్‌దే లీడ్ అని చెప్పొచ్చు. ఇదే సమయంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం జగన్‌కు మైనస్ అయింది..వారిని గాని సెట్ చేస్తే ఇంకా జగన్‌కు తిరుగుండదని చెప్పొచ్చు..ఏదేమైనా జనంలో జగన్ బలం తగ్గలేదనే చెప్పొచ్చు.