ఏపీలో బ్లాక్‌ఫంగస్‌ చికిత్స ఆస్పత్రుల జాబితా ఇదే

-

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో కొంతమంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతున్న విషయం తెల్సిందే. అయితే బ్లాక్‌ఫంగస్‌పై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స 17 ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆస్పత్రుల జాబితాను ఏపీ ప్రభుత్వం గురువారం వెల్లడించింది.

బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స అందించే ఆస్పత్రులు ఇవే..

1. జీజీహెచ్‌ గుంటూరు (ప్రభుత్వ వైద్య కళాశాల)

2. జీజీహెచ్‌, విజయవాడ

3. జీజీహెచ్‌, కాకినాడ (రంగరాయ మెడికల్‌ కళాశాల)

4. ఎస్వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, తిరుపతి

5. స్విమ్స్‌, తిరుపతి

6. జీజీహెచ్‌ (రిమ్స్‌) కడప

7. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు

8.జీజీహెచ్‌, కర్నూలు

9. జీజీహెచ్‌ అనంతపురం (ప్రభుత్వ వైద్య కళాశాల)

10. జీజీహెచ్‌, నెల్లూరు (ఎసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల)

11. జీజీహెచ్‌ (రిమ్స్‌) ఒంగోలు

12. జీజీహెచ్‌ శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)

13. ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, విశాఖపట్నం

14. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖపట్నం

15. ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆస్పత్రి (ఆంధ్రా వైద్య కళాశాల), విశాఖ

16. కేజీహెచ్‌, విశాఖ

17. విమ్స్‌, విశాఖ

కాగా ఇప్పటికే బ్లాక్‌ఫంగ‌స్ చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లోకి తీసుకొస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news