ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మాకు బకాయిలు మధ్యంతర భృతి ప్రకటించాలి : బొప్పరాజు వెంకటేశ్వర్లు

-

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మాకు బకాయిలు మధ్యంతర భృతి ప్రకటించాలి అని  ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులలో మహిళల సంఖ్య 50 శాతం కంటే ఎక్కువ ఉందన్నారు. అందుకే ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర , జిల్లాల మహిళా యూనిట్  లను ఏర్పాటు చేసుకుంది. ఉద్యోగ సంఘాల చరిత్ర లోనే మహిళా విభాగాలు ఏర్పాటు కావడం తొలిసారి అన్నారు.

గతంలో ఎప్పుడూ లేనంత గా వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించారు. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాం. ఇంతగా సహకరిస్తే మాకు ప్రభుత్వం బకాయిలు పెట్టింది. గతంలో ఉద్యమం చేసి అర్ధికేతర అంశాలను సాధించుకున్నాం. కానీ ఇప్పటికీ ఆర్థిక పరమైన అంశాలు పరిష్కారం కాలేదు. మంత్రివర్గం ఉప సంఘం రేపు మాపు అంటూ బకాయిల చెల్లింపు పై మాటలు దాట వేస్తున్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం 6700 కోట్ల మేర బకాయిలు పడింది..పోలీసులకు సరెండర్ లీవ్ లు గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం బకాయి పెట్టలేదు. ఉద్యోగులుగా మేము బోనస్ లు అడగటం లేదు మాకు రావాల్సిన బకాయిలు మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నికల విధుల్లో చేరిన ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలు ఇవ్వాలి. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news