ఈనాడు రామోజీకి బిగ్ షాక్ ఇచ్చారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్. మార్గదర్శి కేసులో ఇంటరిమ్ అప్లికేషన్ దాఖలు చేసిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్… అప్లికేషన్లో పలు అదనపు డాక్యుమెంట్లు జతచేశారు. తన తల్లి ఫిక్స్డ్ డిపాజిట్ పై హెచ్యుఎఫ్ పేరుతో సంతకం చేసిన రామోజీరావు… తిరిగి చెల్లింపు సమయంలో చెక్కుపై ప్రోప్రైటర్ పేరుతో సంతకం చేశారు.
ఈ కీలక పత్రాలను సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు ఉండవల్లి. ఒకచోట హెచ్ యు ఎఫ్ పేరుతో, మరొక చోట ప్రోప్రైటరీ పేరుతో డబుల్ రోల్ పోషించిన రామోజీరావు… హెచ్ యు ఎఫ్ ప్రకారం డిపాజిట్లు స్వీకరిస్తే ఆర్బిఐ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ప్రోప్రైటరి ప్రకారం డిపాజిట్లు స్వీకరిస్తే చిట్ఫండ్ చట్టాన్ని అనుసరించాలి. ఏ చట్టాలను పాటించకుండా తన ఇష్టానుసారంగా రామోజీరావు వ్యవహరించారని ఆరోపణలు చేశారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ తరుణంలోనే, ఇవాళ మార్గదర్శి కేసులో ఇంటరిమ్ అప్లికేషన్ దాఖలు చేశారు.