సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక ఆధారాన్ని సీట్ గుర్తించినట్టు సమాచారం అందుతోంది. సెల్ ఫోన్ డేటాతో పాటు క్లూస్ టీమ్ పరిశీలనలో కేసులో కీలక బ్రేక్ త్రూ ను పోలీసులు సాధించినట్టు సమాచారం అందుతోంది. ఇక ఇవాళ సాయంత్రం లేదా రేపటికి కేసు ఛేదించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఈ దర్యాప్తులో గుర్తించిన అంశాలు, ఆధారాల గురించి బయటకు తెలియకుండా జాగ్రత్త గా వ్యవహరిస్తున్నారు ఏపీ పోలీసులు. అటు పలువురు అనుమానితుల నుంచి కీలక సమాచారం రావడంతో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.