మస్ట్ రీడ్: బాబు.. పవన్.. బీజేపీని ఎవరూ కాపాడలేరు!

-

ఏపీలో బీజేపీని ఎవరూ కాపాడలేరు అన్న నానుడి ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది! అంటే.. ఇది ఇంతకు ముందు లేదని కాదు కానీ.. వారి అసమర్ధతే వారిని అలా నిలిపేస్తుంది! వీర్రాజు కొత్తగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా.. తాము ఏపీలో ఎదగకపోవడానికి చంద్రబాబు ప్రధాన కారణం అని కబుర్లు చెప్పినా… అందులో బాబు జ్ఞానం కంటే ఏపీ బీజేపీ నేతల అజ్ఞానం, అలసత్వమే అధికంగా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి!

అవును.. దేశం మొత్తం ఎదుగుతున్న బీజేపీ, ఏపీలో ఎదగకపోవడానికి ఇంతకాలం చంద్రబాబు కారణమో కాదో తెలియదు కానీ… ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఏపీ బీజేపీ నేతలే కారణం! అందుకు తాజాగా అద్భుతమైన ఉదాహరణలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.. రోజుకొకటి బయటపడుతున్నాయి!

నిన్నగాక మొన్న బెజవాడ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ సమయంలో కావాల్సినంత క్రెడిట్ పొందే అవకాశం వచ్చినా కూడా ఏపీ బీజేపీ నేతలు ట్వీట్లకు పరిమితమయ్యారు. తమ చేతకాని తనానికి ట్విట్టర్ ను సాక్షిని చేశారు! ఇప్పుడేమో తమ ఏపీ మిత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఒక స్టెప్ తీసుకుని క్రెడిట్ పొందే పనిలో ఉంటే… ఏపీ బీజేపీ నేతలు మాత్రం వర్షాలకో ఏమో కానీ సైలంట్ గా ఉన్నారు!

అవును… జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా సంభవించిన వరద నష్టంపై ఒక నివేదికను తయారు చేయించి.. ఆ నివేదిక తీసుకుని కేంద్రంలోని బిజెపి పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా కేంద్రం ద్వారా వచ్చే వరద సాయం క్రెడిట్ ని పొందాలని నిర్ణయించుకున్నారు! ఇక్కడ విచిత్రం ఏమిటంటే… ఇచ్చేది కేంద్రంలోని బీజేపీ అయినప్పుడు.. ఆ నివేధిక ఏదో ఏపీ తెలంగాణల్లోని బీజేపీ అధ్యక్షులే ఇవ్వొచ్చు కదా.. ఆ క్రెడిట్ ఏదో వీరే పొందొచ్చు కదా… ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలపరుచుకోవచ్చు కదా!!

సో… ఇప్పటికైనా అర్ధమైందా కాషాయం బ్రదర్స్… మీరు ఎదగకపోవడానికి మీరే కారణం.. మీ అలసత్వమే కారణం.. మీ నిర్లక్ష్యమే కారణం.. మీ ప్రణాళికా లోపమే కారణం! కాకపోతే మీ అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని, అజ్ఞానాన్ని అప్పుడు చంద్రబాబు క్యాష్ చేసుకుంటే… ఇప్పుడూ పవన్ కల్యాణ్ క్యాష్ చేసుకుంటున్నారు అంతే తేడా… మిగతాదంతా సేం టు సేం!!

Read more RELATED
Recommended to you

Latest news