తిరుపతి సాక్షిగా టిడిపి కి బిజేపి అగ్ని పరీక్ష ?

-

శరణు మహాప్రభో అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ బిజెపి కి దగ్గర అయ్యేందుకు ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో, అన్నిటిని వెతుక్కునే పనిలో ఉంది. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టాలంటే , బీజేపీ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అధికార పార్టీ వైసీపీ వేధింపులు, బాదింపుల విషయం లో ఉపశమనం పొందాలి అంటే, బిజెపి తప్ప తమకు ఇంకో ప్రత్యామ్నాయ మార్గం లేదు అనే విషయం టిడిపి ఎప్పుడో గుర్తించింది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా, ఆ పార్టీ కి దగ్గరయ్యేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. అయితే బిజెపి అండదండలు ఉంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా తెలుసు.
TDP BJP party
అందుకే అంతగా తాపత్రయం పడుతున్నారు.  ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రాబోతున్న నేపథ్యంలో, అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడి నుంచి పోటీ చేయాలని తహతహలాడుతున్నాయి. తమ బలం నిరూపించు కోవాలి అని ఆశ పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా బిజెపి ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో బలమైన పునాదులు వేయడం ద్వారా , తమకు తిరుగులేదు అని నిరూపించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక వైసిపి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబసభ్యుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని చూస్తోంది. కానీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ లో క్లారిటీ రాలేదు.
బలమైన అభ్యర్థులు ఎవరు కనిపించకపోవడంతో, కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి , వర్ల రామయ్య వంటి వారిని నమ్ముకుంది. అయితే టిడిపి ఇక్కడ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, గెలిచే అవకాశం లేదు కాబట్టి, బీజేపీకి మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే బిజెపితో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోకుండా, ఆ పార్టీ టిడిపి ని ప్రధాన రాజకీయ శత్రువుగా చూస్తున్న ఈ పరిస్థితుల్లో టిడిపి పోటీకి దూరంగా ఉండి మరీ బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటించినా,  బిజెపి దానికి అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. అలా అని అన్ని పార్టీలతో పాటు , టీడీపీ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపి బిజెపికి ఇబ్బంది ఏర్పడేలా చేయవచ్చు. ఇలా ఎలా చూసుకున్నా తెలుగుదేశం పార్టీకి పెద్ద అగ్ని పరీక్ష గానే కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news