ఈ నెల 30వ తేదీ తరువాత మరో పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతాం – బొప్పారాజు

ఈ నెల 30వ తేదీ తరువాత మరో పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతామని జగన్‌ సర్కార్‌ కు వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగ సమస్యలపై తీవ్ర స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతున్నామని.. 17 నుంచి 30వరకు దశాల వారిగా శాంతయుత ఉద్యమాలు అని వెల్లడించారు. ప్రజలు కూడా మాకు మద్దతు తెలపాలని ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు.

ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగులను అణచివేసే కుట్ర ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి రావాలి.. ఉద్యమాలకు సిద్ధం కావాలని… మరొక చలో విజయవాడ లాంటి ఆలోచన కార్యక్రమం రాకముందే.. ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఉద్యోగు లకు, ఉద్యోగ నాయకులకు మధ్య మనస్పర్థలు సృష్టించారు.. ప్రభుత్వ పెద్దలకు సమయం ఇచ్చాము.. ఇపుడు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. మా ఆత్మగౌరవం కోసం చేస్తున్న ఉద్యమాన్ని ఉద్యోగులం తా గమనించాలి… 30 తరువాత మరో పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు బొప్పా రాజు.