ఆ రెండు దేశాల్లో ఒక్క చెట్టు కూడా లేదట..!

-

దేశాల్లో: చెట్లు మానవాళి మనుగడకు ఎంత ముఖ్యమైనవే మనకు బాగా తెలుసు.. మన దేశంలో చెట్లను పెంచేందుకు అందరూ ఇష్టపడతారు.. రాష్ట్రాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరీ మొక్కలను నాటిస్తాయి. అలాంటిది..ో ఆ రెండు దేశాల్లో.. కనీసం ఒక్క చెట్టు కూడా లేదంట. అసలు చెట్లు లేకుండా ఎలా అనుకుంటున్నారా..? నిజమండీ.. అక్కడ మీరు చూద్దాం ఉన్నా ఒక్క చెట్టు కూడా కనిపించదు.. ఇంతకీ ఆ రెండు దేశాలు ఎక్కడ ఉన్నాయంటే..

 

దేశంలో ఒక్క చెట్టు కూడా లేదనే వార్త విని ఆశ్చర్యపోతున్నారా? అలాంటి దేశాలు ప్రపంచ వ్యాప్తంగా రెండున్నాయి. మొదటి దేశం గ్రీన్‌లాండ్. ఈ పేరు వినగానే మీకు ముందుగా గుర్తుకొచ్చేది ఆకుపచ్చని ప్రదేశాలు. అందమైన గార్డెన్‌లు, దట్టమైన అడవులు, పచ్చని ప్రకృతిని ఊహించుకుంటారు. పులిహోరలో పులి లేనట్లే.. గ్రీన్‌లాండ్‌లో గ్రీన్‌ లేదు..ఎందుకంటే నిజానికి గ్రీన్‌లాండ్‌లోని వేల మైళ్ల భూమిలో ఒక్క చెట్టు కూడా లేదు. వృక్షసంపద లేని దేశంలో ఇదొకటి ముఖ్యమైనది.

చెట్లు లేని దేశానికి గ్రీన్‌లాండ్ అనే పేరు ఎందుకు పెట్టారనేగా మీ డౌట్.. వాస్తవానికి ఈ దేశం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది అందుకే ఎక్కువ మంది ఇక్కడ నివసించడానికి రారు. అందుకే ఆ దేశానికి గ్రీన్‌ల్యాండ్ అని పేరు పెట్టారు. తద్వారా వీలైనంత ఎక్కువ మందిని ఇక్కడ స్థిరపడటానికి ఆకర్షిస్తారని ప్లాన్‌..

ఇక రెండోది..

ప్రపంచంలో ఇదే విధమైన దేశం మరొకటి ఉంది. అక్కడ అంతే దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా ఒక్క చెట్టు కూడా కనిపించదు. అదే ఖతార్. ఇది చెట్లు లేకపోయినా అత్యంత సంపన్న దేశం. చాలా సురక్షితమైన కంట్రీ. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సంస్థలను కలిగి ఉంది. పెద్ద సంఖ్యలో ఆకాశహర్మ్యాలు, గృహాలు ఈ దేశంలో ఉన్నాయి.. కానీ అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఈ ధనిక దేశంలో ఒక్క చెట్టు కూడా లేకపోవడమే. ఖతార్‌లోని ఖాళీ స్థలంలో ఎక్కడ చూసినా ఎడారి మాత్రమే కనిపిస్తుంది. సంవత్సరంలో ఇక్కడ వర్షాలు చాలా తక్కువ కురుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news