వైసిపి, టిడిపిలు రెండు ఏపీని అప్పుల్లో ముంచాయి – బిజెపి ఎంపీ జీవీఎల్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో పడడానికి వైసిపి, టిడిపి రెండు పార్టీలు కారణమని అన్నారు బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు. రెండు పార్టీలు ఏపీని అప్పుల్లో ముంచాయన్నారు.రాజ్యసభ ను సజావుగా జరక్కుండా అడ్డుకున్న సభ్యులను సస్పెన్షన్ చేశారని తెలిపారు. రాజ్యసభలో తీవ్రవాద అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఆందోళన చేశారని అందుకే సస్పెండ్ చేశారని తెలిపారు.కావాలనే సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ఎంతో మంది ఉగ్రవాదుల లింక్ లు హైదరాబాద్ లో దొరికాయన్నారు.టీఆరెస్ ప్రతినిధులు ఈ బిల్లుపై చర్చను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.ప్రత్యేక హోదా విషయంలో గతంలోనే కేంద్రం స్పష్టత ఇచ్చిందన్నారు జివిఎల్.ప్రత్యేక సహాయం కింద ఏపీకీ 7 వేల 800 కోట్లు చెల్లించిందన్నారు.వైసీపీ అబద్దాలు చెప్పే అవకాశం లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

ఏపీ అప్పుల విషయంలో విభజన సమయంలో 97 వేల కోట్ల అప్పు ఉండగా..5 ఏళ్ల తెలుగుదేశం పాలనలో అప్పులు పెరిగాయన్నారు.ప్రస్తుతం ఏపీ 3 లక్షల 98 వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అడ్డ దారులు తొక్కుతూ అక్రమాలకు పాల్పడుతోందన్నారు.కార్పొరేషన్ల నిధులు కలిపితే అప్పుల భారం మరింత పెరుగుతుందన్నారు జీవీఎల్.

Read more RELATED
Recommended to you

Latest news