ఉచితం అన్నప్పుడు గతం కంటే ఎక్కువకు ఎలా అమ్ముతున్నారు : బొత్స

-

ఇసుక కొరత, ధరలను రాజకీయ కోణంలో కాకుండా ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోమని కోరుతున్నాం అని బొత్స సత్యనారాయణ అన్నారు. ఉచిత ఇసుక అన్నప్పుడు సీవరేజ్ టాక్స్ అవసరం వుండదు. ఉచిత ఇసుకకు వక్ర భాష్యం చెప్పే దోచుకుంటున్నారో బహిర్గతం అవ్వాలి. ఉచితం అన్నప్పుడు గతం కంటే తక్కువకు అమ్మాలో వద్దో ప్రభుత్వమే చెప్పాలి. ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేనప్పుడు గతం కంటే 3 వేల కంటే తక్కువకు అమ్మాలి కానీ ఎలా పెంచి అమ్ముతున్నారు అని ప్రశ్నించారు.

అలాగే ప్రభుత్వం పరిపాలన ప్రారంభించడానికి నాలుగు నెలల సమయం పట్టింది. ఇది ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగంపై ఆధారపడ్డ 25రకాల పనులు చేసేవాళ్ళ భవిష్యత్ అగమ్య గోచరంగా వుంది. ఇసుక మూడు యూనిట్లు 9-10 వేల మధ్య ఇంటి గుమ్మంలోకి తెచ్చి ఇచ్చే వాళ్ళు. గాజువాకలో అయితే 14-15వేలకు లభించేది. ఈ ప్రభుత్వంలో ఇసుక విజయనగరంలో 17-18వేలు అయితే మధురవడలో 19-2 0వేలకు, వైజాగ్ లో అయితే 22వేల రూపాయలు పలుకుతోంది అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news