ఆ విద్యార్థినికి లోకల్ కోటాలో సీటు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశం

-

దుబాయ్ లో పాఠశాల విద్య, హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థిని ఎంబీబీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా గుర్తించాలని తెలంగాణ హైకోర్టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ని  ఆదేశించింది. కొండాపూర్ కి చెందిన అనుమత ఫరూక్ పిటిషన్  విచారించిన అనంతరం చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాస్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో స్థానిక అభ్యర్థిగా పరిగణించకుండా తప్పించడాన్ని ఫరూక్ సవాల్  చేశారు. ఫరూక్ 1998 నుంచి 2008 వరకు 10వ తరగతి వరకు దుబాయ్ లో విద్యాభ్యాసం పూర్తి చేసినప్పటికీ, 2019 నుంచి తెలంగాణలోనే నివాసం ఉంటున్నారని.. తెలంగాణలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి నీట్ పరీక్షకు హాజరయ్యారని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. జులైలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి ఇటీవలి సవరణల ప్రకారం..  ఒక విద్యార్థి తెలంగాణలో వరుసగా నాలుగు సంవత్సరాలు చదివినా లేదా అదే వ్యవధిలో రాష్ట్రంలో నివసిస్తున్నట్లయితే, వారిని స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు.  ఇరు వాదనలు విన్న కోర్టు ఆమెను ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా గుర్తించాలని.. లోకల్ కేటగిరీ కింద అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతిస్తూ యూనివర్సిటీని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news