ఏబీఎన్ ఛానల్ ను వెంటనే ప్రసారం చేయండి: టిడిశాట్

-

టిడీశాట్ లో ఏబీఎన్ -ఆంధ్రజ్యోతికి అనుకూలంగా తీర్పు వెలువడింది.సిటీ విజన్ -హైదరాబాద్ కేబుల్ ఎంఎస్ఓ లకు టి డిశాట్ లో చుక్కెదురైంది. ఏబీఎన్ ఛానల్ లో వెంటనే ప్రసారం చేయాలని సిటీ విజన్- హైదరాబాద్ కేబుల్ ఎంఎస్వో లకు టిడిశాట్ ఆదేశాలు జారీ చేసింది.ఏబీఎన్ ప్రసారాలను నిలిపివేయడంపై సిటీ విజన్ -హైదరాబాద్ కేబుల్ ఎమ్ఎస్వో ల పై టిడిశాట్ ను ఏబీఎన్ ఆశ్రయించింది.అయితే ఏబీఎన్ ప్రసాదాలను నిలిపి వేయలేదని, ప్రసారాలను కొనసాగిస్తున్నామని సిటీ విజన్ తరపు న్యాయవాది టిడిశాట్ కి వివరించారు.

ఈ మేరకు కౌంటర్ ఫైల్ చేసేందుకు సమయం కావాలని కోరారు.అయితే ఏబీఎన్ ఛానల్ ను ప్రసారం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు తమను ఆశ్రయిస్తారని టిడిశాట్ చైర్మన్ జస్టిస్.డి ఎన్ పటేల్ ప్రశ్నించారు.ఏబీఎన్ ఛానల్ ను వెంటనే ప్రసారం చేయాలని ఎం ఎస్ ఓ లకు ఆదేశాలు జారీ చేసింది.అలాగే ఏబీఎన్ ప్రసారం చేస్తున్నట్టు కౌంటర్ దాఖలు చేసేందుకు ఎమ్ఎస్ఓ కు సమయం ఇచ్చింది. హైదరాబాద్ కేబుల్ డిజిటల్ సర్వీసెస్ విచారణకు గైర్హాజర్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news