ఓడించడానికి ఇది మీ అడ్డా కాదు రా… బిడ్డ ఇది జగన్ గడ్డ – మంత్రి రోజా

-

ఓడిస్తాం ఓడిస్తాం అంటే ఓడించడానికి ఇది మీ అడ్డా కాదు రా బిడ్డ ఇది జగన్ మోహన్ రెడ్డి గడ్డ అని మంత్రి రోజా అన్నారు. ఇవాళ తిరుపతిలో మీడియాతో మంత్రి రోజా మాట్లాడుతూ.. రాజకీయంగా జన్మనిచ్చిన నగిరి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. నా తల్లిదండ్రులు నాకు ఊపిరి ఇస్తే జగనన్న ఊహించిన విధంగా నాకు ఉన్నత స్థాయి నుంచి నాకు గౌరవం ఇచ్చారని వెల్లడించారు రోజా.

అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తాను రాజకీయంగా నేను ఇద్దరికీ రుణపడి ఉన్నాను ఒకటి నా నగిరి ప్రజలకి ఇంకొకటి నా ప్రాణమైన జగన్ అన్నకు ఋణపడి ఉంటానని స్పష్టం చేశారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నగిరి అభివృద్ధికి కోసం పని చేస్తానని వెల్లడించారు.

రోజా వచ్చే ఎన్నికలలో సీటు లేదు పనైపోయింది ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు ప్రతిపక్షాలతో పాటు దిగజారుడు రాజకీయాలు చేశారు అలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా గౌరవంగా నన్ను జగనన్న మంత్రి చేశారని వెల్లడించారు. ఓడిస్తాం ఓడిస్తాం అంటే ఓడించడానికి ఇది మీ అడ్డా కాదు రా బిడ్డ ఇది జగన్ మోహన్ రెడ్డి గడ్డ అని.. మొన్నటిదాకా ఒకలెక్క ఇకపై ఒక లెక్క అంటూ సినిమా డైలాగ్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news