175కి 175 కాదు..పులివెందులలోనే జగన్‌ కు ఓటమి ఖాయం – బీటెక్ రవి

175కి 175 కాదు..పులివెందులలోనే జగన్‌ కు ఓటమి ఖాయమని చురకలు అంటించారు బీటెక్ రవి. అభివృద్ధి చెందిన కుప్పంని పులివెందుల స్థాయికి దిగజరుస్తానని సీఎం జగన్ చెబుతున్నారని.. సొంత బాబాయ్ ని కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా హత్య చేస్తాననే సందేశాన్ని మాత్రమే పులివెందుల ప్రజలకు జగన్ ఇచ్చారని వెల్లడించారు.

గాలి జనార్ధన్ రెడ్డి ఎవ్వరో ఏంటో తెలియదన్న జగన్, ఇప్పుడు ఆ వ్యక్తి కంపెనీకి ఓబుళాపురం మైన్స్ కట్టబెడితే అభ్యంతరం లేదంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని.. గాలి జనార్ధన్ రెసంస్థకు ఆర్ ఆర్ గ్లోబల్ తో సంబంధం ఉందని ఆరోపణలు చేశారు. ఆర్ ఆర్ గ్లోబల్ లో సజ్జల డైరెక్టర్ గా ఉన్నారని ఆరోపించారు.

పులివెందుల లో సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వాడు కుప్పం ని అభివృద్ధి చేస్తాననటం విడ్డురమని.. 175 కి 175 అంటున్న జగన్మోహన్ రెడ్డి ముందు పులివెందుల లో గెలిచి చూపాలని సవాల్‌ చేశారు బిటెక్‌ రవి. సొంత బాబాయ్, తల్లి, చెల్లి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారని.. వచ్చే ఎన్నికల్లో ఓట్లేసే ప్రజలూ జగన్ ని దూరం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.