వివేకా లేఖపై నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. వివేకా చనిపోయే ముందు రాసిన లేఖలో నిగూఢ వేలిముద్రలున్నాయేమో గుర్తించడానికి దాన్ని నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు పంపాలన్న సీబీఐ అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఆమోదం తెలిపింది. వివేకా రాసిన లేఖను నిన్‌హైడ్రిన్‌ పరీక్షల నిమిత్తం దిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు విచారణ చేపట్టారు.

నిన్‌హైడ్రిన్‌ పరీక్షల్లో భాగంగా అసలు లేఖ దెబ్బతిన్నా, అందులోని రాత చెరిగిపోయినా ప్రత్యామ్నాయ సాక్ష్యం నిమిత్తం సర్టిఫైడ్‌ కాపీలను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. అవసరమైనన్ని సర్టిఫైడ్‌ కాపీలను సిద్ధం చేసుకోవడానికి వీలుగా వివేకా రాసిన అసలు లేఖను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. నిన్‌హైడ్రిన్‌ పరీక్షలో కాగితంపై ఉన్న ఇంకు చెరిగిపోయే అవకాశం ఉన్నందున ముందస్తు అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news