అవినాష్‌ను లొంగిపోమనండి.. కర్నూలు ఎస్పీని కోరిన సీబీఐ

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విచారణకు రావాల్సిందిగా సీబీఐ మళ్లీ నోటీసులు జారీ చేసిన క్రమంలో తాను రాలేనని అవినాష్ సీబీఐకి లేఖ రాశారు. ఈ దోబూచులెన్నాళ్లంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మేరకు కర్నూలు ఎస్పీతో చర్చలు జరుపుతున్నారు. అవినాష్‌ను లొంగిపోవాలని చెప్పాలంటూ సీబీఐ అధికారులు ఎస్పీని కోరారు. శాంతిభద్రతల నేపథ్యంలో ఎస్పీతో వారు చర్చిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు పంపగా, తాను విచారణకు రాలేనంటూ అధికారులకు అవినాష్‌ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులే కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తన తల్లికి గుండెపోటు వచ్చిందంటూ గత నాలుగు రోజులుగా అవినాష్ రెడ్డి విశ్వభారతి ఆసుపత్రిలోనే ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news