ఏపీలో రంగంలోకి దిగిన కేంద్రం…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి విషయంలో ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసుల తీవ్రత పెరగడమే కాకుండా కోలుకునే వారి సంఖ్య తెలంగాణా సహా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా వరకు తక్కువగా ఉంటుంది. దీనిపై కేంద్రం కాస్త అసహన౦ వ్యక్తం చేస్తుంది. దీనితో తమ బృందాలను ఏపీ కి పంపాలి అని కేంద్ర పెద్దలు భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

30రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 1,359 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 1నాటికి రాష్ట్రంలో 111 పాజిటివ్‌ కేసులున్నాయి. కర్నూలు 400 గుంటూరు కూడా 300కు దగ్గర్లో, కృష్ణాలో 246 కేసులు నమోదు కావడం కాస్త భయపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. 26, 27, 28 తేదీల్లో అయితే వరుసగా 81, 80, 82 పాజిటివ్‌ నమోదు అయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల రెండో వారంలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉండే సూచనలు ఉన్నాయి.

ఏప్రిల్‌ 1- 19వరకూ రోజుకు సగటున 30 కేసులు మాత్రమే ఉన్న ఏపీలో ఆ తర్వాత మాత్రం క్రమంగా పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఏ ఒక్క రోజు కూడా ఈ మధ్య కాలంలో 50 కేసులకు తక్కువగా ఎప్పుడు నమోదు కాలేదు. దీనితో కేంద్రం ఇప్పుడు రంగంలోకి దిగింది. పరిస్థితిని అంచనా వేసి కేసుల కట్టడికి చర్యలు చేపట్టాలనే భావన లో ఉంది కేంద్ర సర్కార్. దీనిపై స్పష్టత వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news